Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 షాకింగ్ బడ్జెట్.. ఎంత పెరిగింది...?
అసలు పుష్ప 2 బడ్జెట్ ఎంత అంటే ఎవరు కూడా కరెక్ట్ గా చెప్పలేరు, మైత్రి మూవీ మేకర్స్‌కు తప్ప ఇండస్ట్రీ లో ఎవరికి తెలీదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం పుష్ప వచ్చిన క్రేజ్ తో దాదాపు మూడువందల యాభై కోట్ల తో బడ్జెట్ తో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారని టాక్ ఉంది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ కు మేకర్స్ ఆన్ లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యం లో పుష్ప 2 చిత్రం బడ్జెట్ భారీగా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది ముందుగా 350 కోట్లు అనుకున్నప్పటికీ ఇప్పుడు డబుల్ అయినట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 కి సుమారు 500 కోట్ల నుంచి 600 కోట్లు ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తుంది. Director Sukumar ఈ సినిమా నీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేస్తున్నారట. అవసరమైతే కొన్ని సీన్స్ నూ రీ షూట్ చేస్తున్నారట దీంతో బడ్జెట్ డబుల్ అయిందనే మాటే వినిపిస్తుంది.
ఇక ఇదే జరిగితే StylishStar Allu Arjun పుష్ప రాజ్ టార్గెట్ 1000 కోట్లు ఫిస్క్ అయినట్టే. బాలీవుడ్ ఆడియెన్స్ పుష్ప 2 ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే వేర్ ఇస్ పుష్ప అంటూ ఓ వీడియోతో అంచనాలను పిక్స్ తీసుకెళ్లారు సుకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా 500 లేదా 600 కోట్ల బడ్జెట్ అంటున్నారు అంటే సుకుమారి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే పుష్ప టూ బడ్జెట్ డబుల్ అనే మాటలలో నిజం లేదని కొందరు అంటున్నారు ఒకవేళ పేరిగినా మహా అయితే మరో 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ డబుల్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఇదిలా ఉంటే 2024 ఆగస్టు 15 న పుష్ప ను రిలీజ్ చేసి తీరుతామని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్ మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.
0 కామెంట్‌లు