Guntur Karam: ట్రెండింగ్ లో మహేష్.. నెట్ ఫిక్స్ తో దేశాలు దాటిన సూపర్ స్టార్ క్రేజ్..

 Guntur Karam: ట్రెండింగ్ లో మహేష్.. నెట్ ఫిక్స్ తో దేశాలు దాటిన సూపర్ స్టార్ క్రేజ్.. 




ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి వినోద రంగంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ చేంజర్‌గా మారే కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి కష్టపడుతుంటే మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సెకండ్ లైఫ్ దోరుకుతోంది.


ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు భాష సరిహద్దులను చెరిపివేస్తున్నాయి బాలీవుడ్ నుంచి వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అయినా టాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఓటీటీలు దూసుకుపోతున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ సొంతం చేసుకుంది ఓటీటీలో కూడా దూసుకుపోతోంది ఇప్పటికే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ లో ఉండగా అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ మూవీ.


మొదట్లో సవాళ్లు ఎదురైనా గుంటూరు కారం విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల మార్క్‌ను దాటగలిగింది ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం మహేష్ బాబు అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది ఈ చిత్రం ఫిబ్రవరి 9 తేది 2024 న డిజిటల్లోకి వచ్చింది అయితే ఈ మూవీ వరుసగా ఐదు వారాల పాటు ఓటీటీలో టాప్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.


 భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించని ప్రభావాన్ని చూపింది పాకిస్తాన్ నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఇది ఆశ్చర్యకరంగా ట్రెండింగ్‌లో ఉంది. ఇక పాకిస్థాన్ ప్రజలు తెలుగు సినిమాలను మరింతగా చూసే అవకాశం ఉంది ఇటీవల వాళ్లకు పుష్ప సినిమా బాగా నచ్చింది అంటూ అందులోని డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ ను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు మహేష్ సినిమా కూడా పాకిస్థాన్లో ట్రెండ్ అవ్వడం ఇండియా లో హాట్ టాపిక్ మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు